Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
కథా సారాంశం ©
ఒక సైంటిస్ట్ శ్యామ్, చనిపోయిన వారిని బ్రతికించే మందు ఫార్ములా నీ తయారు చేస్తాడు, మరియు కనుగొంటాడు కూడా. డాక్టర్ విశాల్, ఫ్రెండ్ సైంటిస్ట్ శ్యామ్ తో సహా కలిసి, మృతదేహాల మీద మందు ఫార్ములా ప్రయోగించి, సక్సెస్ అవుతాడు. మరల, ఈ మందు ప్రభావం అయిపోయిన తర్వాత, ఆ బ్రతికినవారు తిరిగి చనిపోతారు, అది కూడా, ఒక గంట గానీ రెండు గంటల తరవాత.
ఆత్మలు, దయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు గా మారుతాయి, చనిపోయిన వారి ఆత్మలు మృతదేహాల నుండి బయటికి వచ్చి. ఇవన్నీ కలిసి, డాక్టర్ని, సైంటిస్ట్ ని సతా ఇస్తాయి. అఘోరాలు కూడా ప్రజలను నమ్మిస్తారు, అదేమిటంటే చనిపోయిన వారిని బ్రతికిస్తామని. అంతా భయంకర, భయానక దృశ్యాలు.
Dr. పాల్ బ్రంటన్, అమెరికన్ జర్నలిస్ట్ పరిశోధనలు, అఘోరాల మీద అది కూడా ఆడవులలో. ఈ కదా యాభై సంవస్త్సరాల క్రిందట నిజంగా జరిగింది. డబ్బులున్న మేధావులు, అమెరికన్ బిలినైర్లు కలిసి, Dr. పాల్ బ్రంటన్ అనే అమెరికన్ సైంటిస్ట్ ని భారత దేశానికీ పంపించి, ఈ అఘోరాల ఎవరు, ఏమిటి, వారి నిత్యా కృత్యాలు ఏమిటి, వారికున్న మహిమలు కనుక్కుని, రీసెర్చ్ చేసి ఒక రేపార్టీ ని సబ్మిట్ చేయ వలసిందిగా, కోరారు. ఆ విషయం మరియు డాక్టర్ పాల్ బ్రంటన్ బృందం ఏ విధంగా ఈ అఘోరాలను కలిసాడు, కష్టాలను, ఈ జీవం కధలో పొందుపరిచి యున్నది.
సైంటిస్ట్ శ్యామ ని కిడ్నాప్ చేస్తారు సంఘవిద్రోహక శక్తులు. డాక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది.
నిజంగా జరిగిన కథ - సెమినార్ లో చెప్పిన విషయం. ఆ ఊరి ప్రజలందరూ భయాందోళనలో ఉంటారు.
దయ్యాలు, పిశాచాలు, భూతాలు, ఊళ్లలో విహరించి డబ్బులను, చాలా కాస్ట్లీ ఐటమ్స్ను కాజేసి, డాక్టర్ విశాల్ ఇంట్లో దాస్తాయి.
క్లబ్బులు, పబ్బులు, క్యాసినో వా, రేసులు, గ్యాంబ్లింగ్ ప్లేస్ లు, హోటల్ లలో కావలసిన రీతిలో నాటకాలు ఆడతాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని సతాఇస్తాయి.
డాక్టర్ విశాల్, ఒక నెల ఊరు విడిచి వెళ్లి పోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ వారణాసి వెళ్లి అనేక దేవుళ్ళని ప్రార్థిస్తాడు మనశాంతి గురించి. తిరిగి వచ్చేసరికి, ఇంట్లో అంతా ఆశ్చర్యకరం, వద్దంటే డబ్బు, ఎక్కడ చూసినా డబ్బు, పరుపుల కింద, అటక ల మీద, గోను సంచుల్లో, ఇనుప పెట్టెలలో, వాషింగ్ మిషిన్ లలో, ఫ్రిడ్జ్ ల లో, బీరువాలలో, కబోర్డ్స్ లో మొత్తం అంతా డబ్బు.
డాక్టర్ విశాల్ పరేషాన్. దయ్యాలు, భూతాలు, ఆత్మలు, డాక్టర్ ఫ్యామిలీ ని ఒక ఆట పట్టిస్తాయి. డాక్టర్ క్లీనిక్ లో రోగులకు ఈ దయ్యాలు భూతాలు అన్ని పేషంట్లకి కావలసిన పనులు చేస్తాయి.
అంతా అయోమయం, మొత్తం గందరగోళం. సైంటిస్ట్ ని విడుదల పోలీసు వారి సహకారంతో. మందు ఫార్ములా మెడిసిన్ ని, సైంటిస్ట్ శ్యామ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి రెండు కోట్ల రూపాయలకు అమ్మి వేస్తాడు. సైంటిస్ట్ హ్యాపీ.
మృతులు ధైయ్యాలుగా, పిశాచాలుగా మారడానికి, కారణాలు, వీటియొక్క చేష్టలు, ప్రతీకారాలు, ఏ విధంగా వుంటాయో, మరియు వీటియొక్క చేష్టలు, జనజీవనంలో ఎలా వుంటాయో, ప్రజలను ఏ విధంగా సతాయిస్తాయో, ఎందువలన సతాయిస్తాయో, కారణాలు, అన్ని విషయాలు వివరంగా, యి జీవం కధలో వున్నాయి.
ఈ ధైయ్యల ఉనికి, గోల వలన డాక్టర్ విశాల్ యొక్క బాధాలు, ఒకటి అనుకుంటే మరొకటి జరగడం, సైంటిస్ట్ శ్యామ్ యొక్క మనసు చలించటం, తిరిగి అన్ని విషయాలు, చివరికి బాగుగా అవడం, అందరిని సంతోషపరిచే విషయం, మరియు ఈ జీవం స్టోరీ అందరిని ఉత్సాహపరిచే విధంగానూ, భయము, భక్తి, ఆందోళనలు, జన జీవన శైలి విధానాలు, అన్నివిధాలుగా బాగున్నది.
విశాల్ చిన్ననాటి మతిపోయే సంఘటనలు, శవాల దహనాలకు అసలు కారణాలు, నిజంగా జరిగిన కథలు, వేదాంత ధోరణిలో పాట, స్మశాన వాటికలో ఆర్తనాదాలు, డాక్టర్ మరియు సైంటిస్ట్ ల మానసిక వేదనలు, ధైయ్యాలా బాతాఖానీ, ఆత్మలకు తృప్తి మరియు వారణాసి వైభవం, డాక్టర్ విశాల్ పంచ యజ్ఞాలు, ధైయ్యాలు శాంతించి వెళ్లిపోవుట, అనే విషయాలు ఈ జీవం కధలో అందరికి ఉపయోగ కారే రీతిలో, ఎంటర్టైన్మెంట్ ల తో సహా ఆనందోస్త్సవాల రీతిలో ఉంటుంది.
అఘోరాల చేష్టలు, కాటి సీనులు, మృతుల బంధువుల ఆర్తనాదాలు, కొంచం భయానకముఖముగా ఉండును. అఘోరాలు, భారత దేశంలో ఏ ప్రదేశాలలో వుంటారు, మరియు, ఎలాంటి శివాలయాలు ప్రదేశాలలో వుంటారో, వారి యొక్క జీవన విధానం ఏమిటో, వారు ఎందువలన జన జీవనానికి దూరంగా వుంటారో, వారి చేష్టలు, దిన చర్యలు ఎలా వుంటాయో, అఘోరాల యొక్క భక్తి, శివుడు మీద వున్నా రీతి ఎందువలన ఉంటుందో, వారు అలా మారడానికి కారణాలు మరియు వారి యొక్క మనసులోని మాటలు, చేష్టలు, శివ భక్తి భావాలు, అన్నియు...